Home South Zone Andhra Pradesh వేట్లపాలెంలో ప్రమాదం: లారీ ఢీకొని పోస్ట్‌మాస్టర్‌కు తీవ్ర గాయాలు

వేట్లపాలెంలో ప్రమాదం: లారీ ఢీకొని పోస్ట్‌మాస్టర్‌కు తీవ్ర గాయాలు

0

సామర్లకోట మండలం వేట్లపాలెం పెట్రోల్ బంకు సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పోస్ట్‌మాస్టర్ మలకల సూర్యారావు తీవ్రంగా గాయపడ్డారు.

స్కూటీపై వెళ్తున్న ఆయనను వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. స్థానికులు తక్షణమే స్పందించి బాధితుడిని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వేట్లపాలెం మలుపుల వద్ద వాహనాల అతివేగం కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు తక్షణమే వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

NO COMMENTS

Exit mobile version