పెద్దాపురం వృద్ధాశ్రమ నిర్మాణానికి తన ఎంపీలాడ్స్ నిధుల నుంచి ₹50 లక్షలు మంజూరు చేసిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌కు సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ‘ప్రశాంత నిలయం’ పనుల పురోగతిని వివరించిన వారు, కాకినాడ బోట్స్ క్లబ్‌లో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ‘డే కేర్ సెంటర్’ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందిస్తూ, వృద్ధుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని హామీ ఇచ్చారు.
