చీరాల మండలం కొత్తపాలెంలో ఆటో ఢీకొని 18 నెలల పాప సాయి దుర్గ ప్రాణాలు కోల్పోయింది. రహదారిపై ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి ఆటో వెళ్లడంతో ఈ ఘోరం జరిగింది.
భర్తతో విడిపోయి తల్లి వద్దే నివసిస్తున్న పూజ అనే మహిళకు ఈ చిన్నారి మూడో సంతానం. కళ్ల ముందే కూతురు విగతజీవిగా పడి ఉండటం చూసి ఆ తల్లి విలపిస్తున్న తీరు గ్రామస్థులను కన్నీరు పెట్టించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
#Narendra
