Home South Zone Andhra Pradesh మదనపల్లెలో టమాటా ధరల పతనం: రైతుల ఆందోళన

మదనపల్లెలో టమాటా ధరల పతనం: రైతుల ఆందోళన

0

మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధరలు భారీగా పతనమయ్యాయి. నిన్న 24 కిలోల బాక్స్ గరిష్టంగా ₹320 పలకగా, నేడు కేవలం ₹250కి చేరింది. ఒక్కరోజులోనే ధరలు తగ్గడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మార్కెట్‌లో డిమాండ్ తగ్గడమే దీనికి ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. గిట్టుబాటు ధర లభించకపోవడంతో రవాణా ఖర్చులు కూడా భారమవుతున్నాయని రైతులు వాపోతున్నారు.

NO COMMENTS

Exit mobile version