Home South Zone Andhra Pradesh విశాలాక్షి నగర్‌లో దొంగల బీభత్సం.. ₹4 లక్షల విలువైన నగలు చోరీ!

విశాలాక్షి నగర్‌లో దొంగల బీభత్సం.. ₹4 లక్షల విలువైన నగలు చోరీ!

0

పెద్దాపురం విశాలాక్షి నగర్‌లో ఉమ్మెళ్ల ప్రసాద్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు సామర్లకోట భీమేశ్వరస్వామి దర్శనానికి వెళ్లిన సమయంలో, దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని ₹4 లక్షల విలువైన బంగారు నగలు, కిలో వెండిని దోచుకెళ్లారు.

బాధితుడి ఫిర్యాదుతో సీఐ విజయ్ శంకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పట్టణంలో వరుస చోరీల నేపథ్యంలో పోలీసులు గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

NO COMMENTS

Exit mobile version