ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం కృష్ణారావుపాలెంలో ఈరోజు (ఫిబ్రవరి 21) భారీ స్థాయిలో ‘ఆర్గానిక్ రైతోత్సవం’ జరుగుతోంది.
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మేళాలో సేంద్రియ ఉత్పత్తుల ప్రదర్శన, నిపుణులతో చర్చలు, శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి.
రేపు (ఫిబ్రవరి 22) విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలోనూ ఈ ప్రదర్శన కొనసాగుతుంది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, రైతులకు మార్కెటింగ్ లింకేజీలు కల్పించడమే ఈ ఉత్సవం ప్రధాన లక్ష్యం. రైతులు, ఔత్సాహికులు పెద్దఎత్తున పాల్గొనాలని కలెక్టర్ కోరారు.
