కాకినాడ జిల్లా శంఖవరం మండలంలోని పెదమల్లాపురం వద్ద వెలసిన ఆంధ్రా శబరిమలై పుణ్యక్షేత్రం భక్తులతో కళకళలాడుతోంది.
నాగులకొండల మధ్య లక్ష గజాల విస్తీర్ణంలో, కేరళ శబరిమలై తరహాలో ఈ ఆలయం నిర్మితమైంది. పర్వత శిఖరంపై ప్రతిష్ఠించిన శివుడు, ఆంజనేయస్వామి విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇక్కడ ప్రతి ఏడాది నిర్వహించే వనయాత్ర, మకర జ్యోతి దర్శనం ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతున్నాయని ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు.
