గ్రంథాలయాల అభివృద్ధికి ప్రాధాన్యం: చైర్మన్ ఎం.ఎస్.బేగ్

0
0

ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమితులైన ఎం.ఎస్.బేగ్ను నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

విజయవాడ భవానీపురంలోని ఆయన నివాసంలో బేగ్‌ను శాలువాతో సత్కరించి, పుస్తకాలను జ్ఞాపికలుగా అందజేశారు. ఈ సందర్భంగా బేగ్ మాట్లాడుతూ..

మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో అమరావతిలో అత్యాధునిక వసతులతో, డిజిటల్ సౌకర్యంతో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నిర్మాణం వేగంగా జరగబోతోందని తెలిపారు.

రచయితలు, గ్రంథాలయాల మధ్య సమన్వయంతో గ్రంథాలయ వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు.