Home South Zone Andhra Pradesh మధురాతి మధురం మాతృభాష: ఆశ్రమ పిల్లలకు అభ్యసన సామాగ్రి పంపిణీ

మధురాతి మధురం మాతృభాష: ఆశ్రమ పిల్లలకు అభ్యసన సామాగ్రి పంపిణీ

0

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా యువ ప్రగతి పథం సభ్యులు సంజీవని గురుకుల ఆశ్రమ బాలబాలికలకు సొంత నిధులతో అభ్యసన సామాగ్రి, పండ్లు, బిస్కెట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా అధ్యక్షులు, ఉపాధ్యాయులు పగిడి వేణుగోపాల్ మాట్లాడుతూ.. మానవ సంబంధాలకు మాతృభాష ప్రాణమని, పిల్లలు బాల్యం నుంచే తెలుగులో చదవడం, రాయడం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ సేవకార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకుడు రాజశేఖర్, సభ్యులు రత్నం, సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version