విజయవాడ భవానిపురం 42వ డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ (PMUY) కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
18 ఏళ్లు పైబడిన బిపిఎల్ (BPL) మహిళలు ఆధార్, రేషన్ కార్డు, బ్యాంక్ వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చని మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య తెలిపారు.
అర్హులైన వారికి ఉచితంగా గ్యాస్ స్టవ్, సిలిండర్ అందజేస్తారు. ఈ సందర్భంగా ఇండేన్, భారత్, హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీలను ఎంచుకునే వెసులుబాటు కల్పించారు.
