స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పుంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు శనివారం శ్రమదానం నిర్వహించారు. జిల్లా ఎస్పీ పిలుపు మేరకు అన్ని పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల పరిసరాలను సిబ్బంది శుభ్రం చేశారు.
పేరుకుపోయిన చెత్తను తొలగించి, మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రజలకు మెరుగైన సేవలందించడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని పోలీసులు తెలిపారు.
# కొత్తూరు మురళి .
