మదనపల్లె పట్టణ మార్కెట్ యార్డ్ సమీపంలో ఆదివారం భారీ ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి కడప వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.
ఈ ఘటనలో స్తంభం విరిగి రోడ్డుపై పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రమాద సమయంలో జనం లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడగా, విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టి సరఫరాను పునరుద్ధరించారు.
