Home South Zone Andhra Pradesh గ్రామ పంచాయతీలకు ‘యూడీఏ’ నిధులు: మంత్రి నారాయణ కీలక నిర్ణయం

గ్రామ పంచాయతీలకు ‘యూడీఏ’ నిధులు: మంత్రి నారాయణ కీలక నిర్ణయం

0

అమరావతిలో మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో మంత్రి పి. నారాయణ సోమవారం సమీక్ష నిర్వహించారు. అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల (UDA) పరిధిలోని గ్రామాల్లో టౌన్ ప్లానింగ్ విభాగం వసూలు చేసే ఫీజులను తిరిగి ఆయా పంచాయతీల అభివృద్ధికి వెచ్చించేలా కీలక నిర్ణయం తీసుకున్నారు.

వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి ఈ నిధులను నేరుగా గ్రామాలకు బదిలీ చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో చర్చించిన అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

NO COMMENTS

Exit mobile version