మదనపల్లిలో చిన్నారిపై జరిగిన ఘోర కలికలంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంగళవారం తనను కలిసిన బాధిత తల్లిదండ్రులను ఓదార్చిన మంత్రి, ప్రభుత్వం వారికి పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ముఖ్యమంత్రి ప్రకటించిన రూ. 15 లక్షల ఆర్థిక సాయం త్వరగా అందేలా కలెక్టర్‌తో మాట్లాడతానని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
