ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏడో నిందితుడిగా (A7) ఉన్న ముప్పిడి అవినాశ్ రెడ్డి గురువారం విజయవాడలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ముందు లొంగిపోయారు.
ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో, ఫిబ్రవరి 26లోగా లొంగిపోవాలన్న ఆదేశాల మేరకు ఆయన విచారణకు హాజరయ్యారు.
వైసీపీ హయాంలో జరిగిన రూ. 3,500 కోట్ల కుంభకోణంలో ఈయన కీలక పాత్ర పోషించారని, మనీలాండరింగ్‌కు పాల్పడి నిధులను విదేశాలకు మళ్లించారని సిట్ అభియోగాలు మోపింది.
