Home South Zone Telangana నిందితులను కఠినంగా శిక్షించాలి: పసికందు మృతిపై వెల్లువెత్తిన నిరసన.

నిందితులను కఠినంగా శిక్షించాలి: పసికందు మృతిపై వెల్లువెత్తిన నిరసన.

0

నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో కుల వివక్ష కారణంగా జరిగిన దాడిలో రెండు నెలల పసికందు మౌనిక ప్రాణాలు కోల్పోవడం పెను సంచలనం సృష్టించింది.

ఈ అమానుష ఘటనను నిరసిస్తూ బొల్లికుంట గ్రామస్తులు చిన్నారికి అశృనివాళులు అర్పించారు. కేవలం కులం పేరుతో జరిగిన ఈ దాడి మానవత్వానికే మచ్చ అని, పసికందు ప్రాణం తీసిన నిందితులను ఉరి తీయాలని వారు డిమాండ్ చేశారు.

రాజ్యాంగం కల్పించిన సమానత్వాన్ని కాలరాస్తూ ఇటువంటి ఘటనలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వాన్ని కోరారు.

NO COMMENTS

Exit mobile version