పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి (MAO) కే. అలివేణిపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సస్పెన్షన్ వేటు వేశారు. ఏసీబీ (ACB) అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విధుల్లో అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గాను ఆమెను విధుల్లో నుంచి తొలగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
