Home South Zone Andhra Pradesh విజయనగరం జిల్లాలో ఇంటర్ పరీక్షలు: 952 మంది విద్యార్థులు గైర్హాజరు

విజయనగరం జిల్లాలో ఇంటర్ పరీక్షలు: 952 మంది విద్యార్థులు గైర్హాజరు

0

విజయనగరం జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షకు 952 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

మొత్తం 21,048 మందికి గాను 20,096 మంది హాజరైనట్లు ఆర్ఐఓ తవిటినాయుడు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 66 కేంద్రాల్లో పకడ్బందీగా పరీక్షలు జరిగాయని, ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఆయన స్పష్టం చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లతో నిరంతర నిఘా కొనసాగుతోంది.

#BOIENA RAJESH

NO COMMENTS

Exit mobile version