మదనపల్లి బాలాజీనగర్‌లోని ఒక మద్యం షాపు వద్ద బుధవారం రాత్రి యువకుల మధ్య జరిగిన గొడవ హత్యాయత్నానికి దారితీసింది.
చంద్రకాలనీకి చెందిన ప్రదీప్ (32) మరియు అతని స్నేహితులపై, అంగళ్లుకు చెందిన బ్రహ్మతేజ బృందం విచక్షణారహితంగా దాడి చేసింది.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రదీప్‌ను అత్యవసర చికిత్స నిమిత్తం తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
