ములకలచెరువుకు చెందిన అబ్దుల్ సమద్, హీనా దంపతులకు మదనపల్లెలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆడబిడ్డ జన్మించింది.
అయితే, పుట్టిన వెంటనే శిశువుకు మూర్ఛ రావడంతో మెరుగైన వైద్యం కోసం మరో చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూసింది. అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన బిడ్డ పుట్టిన రోజే మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో పెను విషాదం నెలకొంది.
