రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. “ఆడపిల్లల జోలికొస్తే అదే వారికి చివరి రోజు” అనేంత కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నామని ఆమె హెచ్చరించారు.
గత ప్రభుత్వంతో పోలిస్తే నేరాలు తగ్గాయని, శక్తి యాప్, డ్రోన్ నిఘా వంటి చర్యల ద్వారా శాంతిభద్రతలను కాపాడుతున్నామని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విమర్శలకు బదులిచ్చారు.
