బొబ్బిలి మండలం కొత్తపెంటలో బంగారమ్మ తల్లి ఆలయం నూతనంగా నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని దేవాదాయ ధర్మదాయ శాఖామంత్రి రాంనారాయణ రెడ్డికి ఎమ్మెల్యే బేబినాయన, సర్పంచ్ చోడవరపు సూర్యనారాయణ, పీఏసీఎస్ అధ్యక్షుడు బి.శ్రీరామమూర్తి వినతిపత్రం అందించారు.
అమరావతిలో బుధవారం మంత్రిని కలిశారు. కొత్తపెంటలో బంగారమ్మ తల్లి ఆలయం నూతనంగా నిర్మిస్తామని, నిధులు మంజూరు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
#BOIENA RAJESH
