మదనపల్లి మండలం సీటీఎంలో ఇటుకల బట్టీ కార్మికుడిగా పనిచేస్తున్న శివయ్య బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.
మంగళవారం రాత్రి పని ముగించుకుని వెళ్తుండగా, గంగమ్మ గుడి వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్ పై బైక్ అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి ఆయన్ను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
