Home South Zone Andhra Pradesh మదనపల్లిలో విషాదం: వాహనం ఢీకొని జింక మృతి

మదనపల్లిలో విషాదం: వాహనం ఢీకొని జింక మృతి

0

మదనపల్లి మండలం బెంగళూరు రోడ్డులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక జింక ప్రాణాలు కోల్పోయింది. రెడిఫుడ్స్ ఫ్యాక్టరీ సమీపంలోని చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద రోడ్డు దాటుతుండగా, గుర్తుతెలియని వాహనం వేగంగా ఢీకొట్టింది.

అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంత రోడ్లలో వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

NO COMMENTS

Exit mobile version