హైదరాబాద్‌లోని ఛాత్రినాక ప్రధాన రహదారులపై మురుగునీరు పొంగిపొర్లుతుండటంతో స్థానిక ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్లన్నీ జలమయమై దుర్వాసన వెదజల్లుతుండటంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటమే దీనికి కారణమని, అధికారులు తక్షణమే స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.










