Home South Zone Andhra Pradesh తమ్ముడి మృతిపై అన్న అనుమానం: మదనపల్లి పోలీస్ స్టేషన్ వద్ద నిరసన!

తమ్ముడి మృతిపై అన్న అనుమానం: మదనపల్లి పోలీస్ స్టేషన్ వద్ద నిరసన!

0

తన తమ్ముడు దివాకర్ అదృశ్యం మరియు మృతిపై వలసపల్లికి చెందిన పురుషోత్తం శనివారం మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు.

జనవరి 4న తన తమ్ముడు కనిపించకుండా పోయినా, పోలీసులు నెల రోజుల వరకు కేసు నమోదు చేయలేదని ఆయన ఆరోపించారు.

ఇప్పుడు గణేష్ అనే వ్యక్తి హత్య చేశాడని చెప్పడం వెనుక కుట్ర ఉందని, పోలీసుల అలసత్వం వల్లే తన తమ్ముడిని కోల్పోవాల్సి వచ్చిందని పురుషోత్తం ఆవేదన వ్యక్తం చేశారు.

NO COMMENTS

Exit mobile version