మదనపల్లి బాలాజీ నగర్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్‌ను డీఈవో సుబ్రహ్మణ్యం, ఏపీసీ అనూరాధ ప్రారంభించారు.
విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, నిత్య జీవితంలో శాస్త్రీయ దృక్పథాన్ని, తార్కిక ఆలోచనలను అలవర్చుకోవాలని డీఈవో సూచించారు.
దేశాభివృద్ధిలో సైన్స్ పాత్ర కీలకమని, విద్యార్థులు సృజనాత్మకతతో కొత్త ఆవిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
