విశాఖ రూరల్ చంద్రంపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు మలుగు వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో సుమారు 3,060 మంది విద్యార్థులు, 100 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నిత్య జీవితంలో సైన్స్ మరియు కృత్రిమ మేధ (AI) ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, ప్రాజెక్ట్ పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. సర్ సి.వి. రామన్ సేవలను ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కొనియాడారు.
