కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనపై సీపీఐ జిల్లా కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం సరిపోదని, తక్షణమే ఒక్కొక్కరికి రూ. 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు డిమాండ్ చేశారు.
ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భద్రతా ప్రమాణాల అమలులో వైఫల్యాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని సీపీఐ నాయకులు విజ్ఞప్తి చేశారు.
