Home South Zone Andhra Pradesh చిన్నముక్కపల్లిలో పింఛన్ల పంపిణీ: లబ్ధిదారులకు అండగా ప్రభుత్వం!

చిన్నముక్కపల్లిలో పింఛన్ల పంపిణీ: లబ్ధిదారులకు అండగా ప్రభుత్వం!

0

అన్నమయ్య జిల్లా రాయచోటి రూరల్ మండలం చిన్నముక్కపల్లిలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో రాయచోటి మండల టీడీపీ అధ్యక్షుడు గండికోట సుధాకర్, తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ మధుబాబు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ నగదును అందజేశారు.

కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, అర్హులందరికీ ఇంటి వద్దకే పింఛన్ అందిస్తున్నామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version