చీరాల సబ్ డివిజన్ పరిధిలోని రామాపురం పెరల్స్ రిసార్ట్ వేదికగా బీచ్ రిసార్ట్స్ యాజమాన్యాలతో పోలీసులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చీరాల డీఎస్పీ, రూరల్ సీఐ, వేటపాలెం ఎస్ఐ మరియు చీరాల రూరల్ ఎస్ఐలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రిసార్ట్స్ వద్ద తీసుకోవాల్సిన భద్రతా జాగ్రత్తలపై యాజమాన్యాలకు దిశానిర్దేశం చేశారు.
ముఖ్యంగా విదేశీ పర్యాటకులు (Foreigners) సందర్శించినప్పుడు వారి వివరాలను ఎప్పటికప్పుడు పోలీసులకు తెలియజేయాలని, రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. తీర ప్రాంత భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
#Narendra
