Home South Zone Andhra Pradesh ముందస్తు వేసవి తాపం: మార్చిలోనే 37 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు.|

ముందస్తు వేసవి తాపం: మార్చిలోనే 37 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు.|

0

వేసవి కాలం అధికారికంగా ప్రారంభం కాకముందే ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు ముదురుతున్నాయి. మార్చి మొదటి వారంలోనే దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 6.5 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది.

ఏపీలో కూడా మార్చి తొలి రోజుల్లోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలు దాటే సూచనలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత ఎక్కువగా ఉండనుంది.

NO COMMENTS

Exit mobile version