దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి శనివారం (ఫిబ్రవరి 28) నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
ఉదయం 10:30 గంటలకు దర్శి పట్టణంలోని 17వ వార్డులో, అనంతరం 11:00 గంటలకు వెంకటాచలంపల్లి గ్రామంలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు.
కూటమి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను లబ్ధిదారులకు నేరుగా అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ కార్యాలయం కోరింది.
