2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలను ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు ప్రణాళికలు ఖరారు చేశారు.
ఈ పుష్కరాలకు దాదాపు 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న ప్రభుత్వం, 6 జిల్లాల పరిధిలో మొత్తం 369 స్నానఘట్టాలను (Ghats) అందుబాటులోకి తీసుకురానుంది. భక్తుల సౌకర్యార్థం టెంట్ సిటీలు, హోమ్ స్టేలు ఏర్పాటు చేయడంతో పాటు పారిశుద్ధ్యం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
