Home South Zone Andhra Pradesh మదనపల్లి: ప్రభుత్వ ప్రణాళికలకు జనగణనే ప్రాతిపదిక: కలెక్టర్.

మదనపల్లి: ప్రభుత్వ ప్రణాళికలకు జనగణనే ప్రాతిపదిక: కలెక్టర్.

0

ప్రభుత్వ విధానాల రూపకల్పనకు, సంక్షేమ పథకాల అమలుకు ఖచ్చితమైన జనగణన గణాంకాలే బలమైన పునాది అని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లెలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో అధికారులకు ‘గృహ గణన’పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 1872 నుండి ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జరుగుతున్న ఈ ప్రక్రియ కోవిడ్ కారణంగా వాయిదా పడి ఇప్పుడు ప్రారంభమైందని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన, నిధుల కేటాయింపు వంటి కీలక నిర్ణయాలు ఈ లెక్కలపైనే ఆధారపడి ఉంటాయని వివరించారు.

NO COMMENTS

Exit mobile version