తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందించారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.
కేవలం సాధారణ వైద్య పరీక్షల (Routine Check-up) నిమిత్తమే హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆసుపత్రికి వచ్చినట్లు తెలిపారు.
ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. దీంతో ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.
#Boiena Rajesh
