Home South Zone Andhra Pradesh 1991 పట్టా భూములపై పెద్దల కన్ను.. ఏఐసీసీకి చేరనున్న ఫిర్యాదు.

1991 పట్టా భూములపై పెద్దల కన్ను.. ఏఐసీసీకి చేరనున్న ఫిర్యాదు.

0

విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం మల్లంపేటలో నిరుపేద రైతులకు చెందిన సాగు భూముల ఆక్రమణపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

1991లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్ ద్వారా కేటాయించిన పట్టా భూములను కొందరు పలుకుబడి ఉన్న వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకున్నారని నియోజకవర్గ ఇన్ఛార్జ్ మువ్వల శ్రీనివాసరావు ఆరోపించారు.

35 ఏళ్లుగా ఆ భూములపైనే ఆధారపడి బతుకుతున్న రైతుల పొట్ట కొట్టడం అన్యాయమని మండిపడ్డారు. ఈ భూ కబ్జా వ్యవహారాన్ని ఢిల్లీలోని ఏఐసీసీ (AICC) దృష్టికి తీసుకెళ్లి, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ఆయన హెచ్చరించారు.

NO COMMENTS

Exit mobile version