Home South Zone Andhra Pradesh వంతెన వద్ద అదుపు తప్పిన బైక్: గెడ్డలో పడి 19 ఏళ్ల కిషోర్ మృతి.

వంతెన వద్ద అదుపు తప్పిన బైక్: గెడ్డలో పడి 19 ఏళ్ల కిషోర్ మృతి.

0

విజయనగరం జిల్లా ఎల్.కోట మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

వేపాడ మండలం గుడివాడకు చెందిన గుడివాడ కిషోర్ తన బైక్ పై కొట్యాడలోని తాతగారి ఇంటికి వెళ్తుండగా, ఖాసాపేట సమీపంలోని వంతెన వద్ద ప్రమాదం జరిగింది.

బైక్ అదుపు తప్పి పక్కనే ఉన్న గెడ్డలో పడిపోవడంతో, కిషోర్ నీటిలో మునిగి అక్కడికక్కడే మృతి చెందాడు. హెడ్ కానిస్టేబుల్ పాపారావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

#BOIENA RAJESH

NO COMMENTS

Exit mobile version