Home South Zone Andhra Pradesh 40 ఏళ్ల సుదీర్ఘ సేవలకు ముగింపు: ఏఎన్ఎంగా లూథియ పీబీ రిటైర్మెంట్.

40 ఏళ్ల సుదీర్ఘ సేవలకు ముగింపు: ఏఎన్ఎంగా లూథియ పీబీ రిటైర్మెంట్.

0

విశాఖ జిల్లా శొంఠియాం ఆయుష్ ఆసుపత్రిలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న గండి లూథియ పీబీ శనివారం (ఫిబ్రవరి 28) పదవీ విరమణ చేశారు.

1986లో విధుల్లో చేరిన ఆమె, గత 40 ఏళ్లుగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నిబద్ధతతో వైద్య సేవలు అందించారు.

1964లో జన్మించిన ఆమె తన పదవీ కాలం ముగియడంతో సహోద్యోగులు ఆమెను ఘనంగా సన్మానించారు. ఆమె అందించిన సేవలు మరువలేనివని ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది కొనియాడారు.

NO COMMENTS

Exit mobile version