మదనపల్లి పట్టణంలో ప్రజలు తమ నిరసనలు తెలుపుకోవడానికి ప్రత్యేకంగా ధర్నా చౌక్ ఏర్పాటు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాపాడాలని, ప్రస్తుతానికి ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు చేయడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని వారు పేర్కొన్నారు.
తక్షణమే మున్సిపల్ అధికారులు, పోలీసులు స్పందించి ఒక నిర్దిష్ట స్థలాన్ని కేటాయించాలని, తద్వారా ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే అవకాశం కలుగుతుందని సీపీఎం స్పష్టం చేసింది.
