Home South Zone Andhra Pradesh ఎన్.సి.సి. ఆఫీసర్ గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి అవార్డు.

ఎన్.సి.సి. ఆఫీసర్ గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి అవార్డు.

0

మదనపల్లె మండలం చిన్నతిప్పసముద్రం పి.ఎం. శ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాల ఎన్.సి.సి. ఆఫీసర్ ఎం. గిరిధర్ నాయక్ ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి అవార్డును అందుకున్నారు.
16 ఏళ్లుగా ఎన్.సి.సి. విభాగంలో ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఢిల్లీ డైరెక్టరేట్ జనరల్ (DG) కమాండేషన్ కార్డ్ మరియు బ్యాడ్జ్‌ను ప్రకటించారు.

శనివారం చిత్తూరులోని 35వ ఆంధ్ర ఎన్.సి.సి. బెటాలియన్ కార్యాలయంలో కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎన్.వి. మోనిస్ చేతుల మీదుగా గిరిధర్ నాయక్ ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా పాఠశాల యజమాన్యం ఆయనను ఘనంగా అభినందించింది.

NO COMMENTS

Exit mobile version