అన్నమయ్య జిల్లా రాయచోటి, మదనపల్లె ప్రాంతాల్లో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. వ్యూగోల్, ట్రూహెల్త్ వంటి కంపెనీల పేర్లతో నిరుద్యోగుల నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు.
కడప, హైదరాబాద్ కేంద్రాలుగా సాగుతున్న ఈ దందాను ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారు.
నిరుద్యోగులు ఎవరూ ముందస్తు ఫీజులు చెల్లించవద్దని, మోసపోతే తక్షణమే 1930 లేదా 100 నంబర్లకు ఫిర్యాదు చేయాలని బాధితులు, పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
