Home South Zone Telangana అడవి తల్లి దీవెన…. గుంజేడు ముసలమ్మ జాతర!

అడవి తల్లి దీవెన…. గుంజేడు ముసలమ్మ జాతర!

0

మహబూబాబాద్ జిల్లా ప్రకృతి ఒడిలో వెలసిన గుంజేడు ముసలమ్మ జాతర నేటి నుండి ప్రారంభం కానుంది. ఈ నెల 4 నుండి 6 వరకు మూడు రోజుల పాటు ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.

రెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ జాతర గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. భక్తులు తమ కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ముసలమ్మను కొలుస్తారు.

ముఖ్యంగా సంతానం లేని వారు అమ్మవారిని దర్శించుకుంటే ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Exit mobile version