అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మార్కెట్ డైరెక్టర్ డాన్స్ రెడ్డప్ప జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జై భీమ్ నాయకులు భాస్కర, ఎర్రబెల్లి సమరసింహారెడ్డి, బొమ్మశెట్టి పురుషోత్తం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
వారు రెడ్డప్పకు శుభాకాంక్షలు తెలిపి, ఆయన సమాజ సేవను కొనియాడారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.
