అన్నమయ్య జిల్లా అభివృద్ధి పనులపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నేడు. సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు మదనపల్లి పబ్లిక్ రిలేషన్స్ అధికారి భరత్ కుమార్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ సమీక్షలో ప్రభుత్వ పథకాల అమలు, పెండింగ్ పనుల పురోగతిపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు హాజరుకానున్నారు.
