Home South Zone Andhra Pradesh మదనపల్లె: అప్పు అడిగినందుకు బట్టల వ్యాపారిపై దాడి.

మదనపల్లె: అప్పు అడిగినందుకు బట్టల వ్యాపారిపై దాడి.

0

మదనపల్లె ఈశ్వరమ్మ కాలనీలో బాకీ సొమ్ము అడిగినందుకు ముబీనా (40) అనే మహిళపై సోఫియా అనే మహిళ దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో, ఏడాది క్రితం రూ. 10 వేల విలువైన బట్టలను అప్పుగా ఇచ్చిన ముబీనా, ఆ బాకీని తిరిగి ఇవ్వాలని నిలదీయడంతో గొడవ జరిగింది.

బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముబీనా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

NO COMMENTS

Exit mobile version