Home South Zone Andhra Pradesh రొంపిచర్లలో అంగన్‌వాడీ హెల్పర్ పోస్టుల భర్తీ: దరఖాస్తులు ప్రారంభం.

రొంపిచర్లలో అంగన్‌వాడీ హెల్పర్ పోస్టుల భర్తీ: దరఖాస్తులు ప్రారంభం.

0

చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ శిరీష బుధవారం తెలిపారు.

మండలంలోని పాతపేట, మోటుమల్లెల, బలిజవీధి, ఆర్ సి కాలనీ (ఓసి), నగిరి హరిజనవాడ, కట్టావారిపల్లి, గుట్ట కింద హరిజనవాడ (ఎస్సీ)లలో ఖాళీలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

ఈ ఉద్యోగాలకు పది పాసై, 21-35 ఏళ్ల మధ్య వయస్సు ఉండి, స్థానికులై, వివాహితులై ఉండాలని అర్హతలు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్లతో ఈనెల 16వ తేదీ లోపు పులిచెర్ల కార్యాలయంలో సాయంత్రం 5 గంటలలోపు సంప్రదించాలని సూచించారు

# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version