Home South Zone Andhra Pradesh త్వరలో చీరాలలో పవన్ పర్యటన? ఎమ్మెల్యే ఆహ్వానానికి గ్రీన్ సిగ్నల్.

త్వరలో చీరాలలో పవన్ పర్యటన? ఎమ్మెల్యే ఆహ్వానానికి గ్రీన్ సిగ్నల్.

0

చీరాల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో పవన్‌ను కలిసిన ఆయన, దెబ్బతిన్న రహదారులు, తాగునీటి ప్రాజెక్టుల సమస్యలను వివరించారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం, నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు. పర్యాటక ప్రాంతమైన చీరాలలో పర్యటించాలని ఎమ్మెల్యే కోరగా, పవన్ కళ్యాణ్ సుముఖత వ్యక్తం చేశారు.

NO COMMENTS

Exit mobile version