మదనపల్లె కుమారపురంలో గురువారం రాత్రి ప్రేమ వివాహం చేసుకున్న భార్య ఉమాదేవి (23)పై భర్త పవన్ కళ్యాణ్ ఇటుకరాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
కూలి పనులకు వెళ్లి ఆలస్యంగా వచ్చిందన్న నెపంతో, మద్యం మత్తులో ఉన్న భర్త ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఇద్దరు ఆడపిల్లలున్న ఆ కుటుంబంలో భర్త తరచూ తనను వేధిస్తున్నాడని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.
