మదనపల్లిలో మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ‘ఓపెన్ హౌస్’ ప్రదర్శనను ఎస్పీ ధీరజ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏకే-47 వంటి అత్యాధునిక ఆయుధాలు, బాంబ్ స్క్వాడ్ పరికరాలు, కమ్యూనికేషన్ సెట్ల పనితీరును విద్యార్థులకు వివరించారు.
‘శక్తి టీం’ మహిళలకు రక్షణ కవచంలా ఉంటుందని, ఆపదలో ఉన్నవారు భయం వీడి పోలీసులను సంప్రదించాలని ఎస్పీ భరోసా ఇచ్చారు. యువత టెక్నాలజీపై అవగాహన పెంచుకుని, వ్యసనాలకు దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
